Friday, 31 July 2026 03:08:37 AM
# చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ # గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

Date : 30 July 2026 08:18 PM Views : 13

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనందించే లక్ష్యంతో చేతన ఫౌండేషన్ మరియు గూడూరు ట్రస్ట్ ఆర్థిక సహకారంతో, కొల్లి ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు గురువారం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్  సిరిపురం లలిత కుమారి మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (ఎడ్యుకేషన్) ఎస్. వెంకటాచారి మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని అన్నారు. సమాజాభివృద్ధిలో సేవా సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ మహిళా సాధికారతకు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ సభ్యులు వెనిగళ్ళ అనిల్ కుమార్, దొడ్డ సీతారామయ్య, చంద్రకాని నవీన్,కొల్లి ఫౌండేషన్ చైర్మన్  కల్పన, రూప్లా నాయక్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :